సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం సాధారణంగా జరుగుతుంది. కొండా సురేఖ ప్రస్తుత పరిస్థితిని తలచుకుంటే సమంత (Samantha) విషయంలో నోరు జారడం ఆమెకు చేటు చేసింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె చెప్పినా ఇప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఈ వివాదం విషయంలో ఒక విధంగా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. నాగార్జున (Nagarjuna) ఇప్పటికే కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.
ఇండస్ట్రీ ప్రముఖులు ఈ విషయం గురించి తెలంగాణ సీఎంను కలిసే అవకాశాలు ఉన్నాయి. అక్కినేని అమల రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. నాగచైతన్య (Naga Chaitanya) సైతం కొండా సురేఖ ఆరోపణలపై ఒకింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత పెద్దదయ్యే ఛాన్స్ అయితే ఉంది. హద్దులు దాటిన కామెంట్లు, విమర్శల వల్ల ఇబ్బందులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులపై అసత్య ఆరోపణలతో బురద జల్లితే ఇబ్బందేనని ఈ ఘటనతో ప్రూవ్ అయింది.
వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తే ఊరుకునే అవకాశమే లేదని ఈ ఘటనతో ప్రూవ్ అయింది. కొండా సురేఖ అటు సమంతకు ఇటు అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెబితే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది. కొండా సురేఖ ఈ వివాదానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. నాగార్జున మాత్రం కోర్టులో తనకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.
రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని సినీ ప్రముఖులను పొలిటికల్ వివాదాల్లోకి లాగడం మంచిది కాదని నెటిజన్లు ఫీలవుతున్నారు. కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుంతో చూడాలి. ఆమె మంత్రి పదవికి మాత్రం ఇబ్బందులు మొదలైనట్టేనని చెప్పవచ్చు.