ఆదివారం ఎపిసోడ్ లో హైడ్రామా..! కావాలనే బిగ్ బాస్ టీమ్ ఇలా చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే మోత మోగింది. చాలా హుషారుగా స్టార్ట్ అయిన ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించాడు. ఫస్ట్ ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఉన్న సాంగ్స్ ని హౌస్ మేట్స్ గెస్ చేస్తూ ఎంటర్ టైన్ చేశారు. ఇక్కడే రేవంత్ కి , ఇంకా ఆదిరెడ్డికి ఇద్దరికీ పంచ్ లు పడుతూనే ఉన్నాయి. నాగార్జున ఈసారి సెటైర్స్ వేయడంలో తన మార్క్ ని చూపిస్తున్నాడు. ఇలా గేమ్స్ ఆడిస్తునే ఒకొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చాడు కింగ్ నాగార్జున.

ఇందులో భాగంగా ముందుగా రోహిత్ సేఫ్ అయ్యాడు. రోహిత్ సేఫ్ అవ్వగానే హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. నిజానికి రోహిత్ ఎలిమినేట్ అయిపోతాడని అనుకున్నారు. కానీ, ముగ్గురు మిగిలే సరికి ఈసారి శ్రీసత్య వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, తర్వాత శ్రీసత్యని కూడా నాగార్జున సేఫ్ అని చెప్పాడు. దీంతో ఖంగుతిన్నారు హౌస్ మేట్స్. ఇక ఆదిరెడ్డి – ఇనయా ల మద్యలో అత్యంత నాటకీయంగా ఎలిమినేషన్ అనేది జరిగింది. వైట్ బోర్ట్ పై ఇనయా పేరు రాగానే ఇనయా కళ్లలో నీళ్లు తిరిగాయి.

హౌస్ మేట్స్ ఎవరితోనూ మాట్లాడుకుండా అలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. తన లగేజ్ ని స్టోర్ రూమ్ లో పెట్టుకుంటూ, హౌస్ మేట్స్ ని పట్టించుకోకుండా బయలుదేరబోయింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా తన గేమ్ గురించి మాట్లాడుతూ, తనకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ముఖ్యంగా అదిరెడ్డి తన గేమ్ ని పొగిడాడు. చాలా బాగా గేమ్ ఆడావని చెప్పాడు. ఇక స్టేజ్ పైకి వచ్చిన ఇనయ తన జెర్నీని చూస్కుని హ్యాపీగా ఫీల్ అయ్యింది. భావోద్వేగమైన గుండెతో బయటకి వచ్చింది.

అంతేకాదు, హౌస్ మేట్స్ లో ఉన్న ఒక మంచి లక్షణం, ఒక చెడు లక్షణం ఏంటనేది చెప్పింది. దీని తర్వాత నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 6మంది ఉన్నారని, ఈ ఆరుగురులో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతానికి ఓటింగ్ లైన్స్ అన్నీ ఓపెన్ అయ్యాయని ఫైనలిస్ట్ లుగా ఆరుగురులో ఒకరు మద్యలోనే అంటే బుధవారం ఓటింగ్ తో ఇంటికి వెళ్లిపోతారని చెప్పాడు.

దీంతో ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారని, శుక్రవారం అర్ధరాత్రి వరకూ కూడా ఓపెన్ ఉంటాయని ఓట్ వేసిన వాళ్లు మాత్రమే విన్నర్ అవుతారని చెప్పాడు కింగ్ నాగార్జున. ఇక్కడే పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే అంతా జరుగుతుందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ఇనయా ఎలిమినేషన్ పై వస్తున్న కామెంట్స్ కి ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus