Nagarjuna: నాగార్జున కచ్చితంగా ఆ సినిమా చెయ్యాల్సిందేనట..!

అక్కినేని నాగార్జున ఈ మధ్య కాలంలో సరైన హిట్టు కొట్టలేక పోతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన నుండీ వచ్చిన సినిమాలు అన్నీ ప్లాపులే..! ‘ఓం నమో వెంకటేశాయ’ ‘ఆఫీసర్’ ‘మన్మథుడు2’ ‘వైల్డ్ డాగ్’ వంటి సినిమాలు నాగార్జునను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ‘దేవదాస్’ ‘రాజు గారి గది2’ వంటి సినిమాలు యావరేజ్ గా ఆడినా నాగార్జునకు కలిసి రాలేదు. అంతకు ముందు ‘మనం’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘ఊపిరి’ వంటి బ్లాక్ బస్టర్లతో జెట్ స్పీడులో దూసుకుపోయిన నాగ్ ను చూసి స్టార్ హీరోలు కూడా భయపడ్డారు. కానీ ఆ తరువాత సీన్ రివర్స్ అయిపోయింది. ‘వైల్డ్ డాగ్’ సినిమా 5 కోట్లు షేర్ ను కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది అంటే అతని మార్కెట్ ఎంత డేంజర్లో పడిందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ విషయంలో నాగ్ కూడా డిజప్పాయింట్ అయినట్టు టాక్ వినపడుతోంది. ఇప్పుడు నాగ్ కచ్చితంగా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాగార్జున. కానీ అందులో అతనిది అతిథి పాత్రే. ఆ సినిమా హిట్టయినా ఇతనికి కలిసొచ్చేది ఏమి ఉండదు. దాంతో పాటు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఇది యాక్షన్ మూవీ..! పైగా భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉందట. ఇప్పుడు బడ్జెట్ ను తగ్గించేందుకు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా నాగ్ హోల్డ్ లో పెడుతూ వస్తున్న ‘బంగార్రాజు’ సినిమాని ఇప్పుడు కచ్చితంగా చెయ్యాలి అని ఆయన అభిమానులు కోరుతున్నారు. మంచి మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీతో హిట్టు కొట్టి తమ అభిమాన హీరో కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేసిన మార్పులు కూడా నాగ్ కు నచ్చాయి. కానీ ప్రవీణ్ సత్తారు ప్రాజెక్టు ని కంప్లీట్ చేసిన తరువాతే.. తాను నిర్మాతగా ‘బంగార్రాజు’ ప్రాజెక్టుని పట్టాలెక్కించాలని నాగ్ భావిస్తున్నాడట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus