కొత్త సినిమా మొదలెట్టనున్న బాస్‌

ఊటీలో ఫలానా సినిమా షూటింగ్‌ జరగబోతోంది… ఈ మాట విని చాలా రోజులైంది కదా. తెలుగు సినిమాలు ఊటీలో చిత్రీకరణ జరుపుకోవడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుత తరం సినిమాలు అక్కడ చిత్రీకరణ జరుపుకోవడం అరుదుగానే చూస్తున్నాం. ఒకప్పుడు పాట అంటే అక్కడికే వెళ్లిపోయేవారు. మళ్లీ ఇప్పుడు అలాంటి రోజులు మొదలవుతాయా? ఏమో నాగార్జున అయితే తన తర్వాతి సినిమాను ఊటీలో షూట్‌ చేయబోతున్నాడట. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే.

ప్రవీణ్‌ సత్తారు – నాగార్జున కాంబో గురించి చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల సినిమా ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది. పోస్ట్‌ లాక్‌డౌన్‌ షూటింగ్‌ మొదలుపెట్టి ‘వైల్డ్‌ డాగ్‌’ను పూర్తి చేశాడు బాస్‌. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు సినిమాలో పనులు మొదలుపెట్టారట. మరికొద్ది రోజుల్లో సినిమా ముహూర్తం ఉండబోతోందట. అలాగే ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. తొలి షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో ఉండోబోతోందట. ఆ తర్వాత ఊటీ వెళ్తారట.

మార్చి మొదటివారంలో చిత్రబృందం ఊటీ వెళ్లి మూడు వారాల షెడ్యూల్‌ షూట్‌ చేయబోతోందట. ఆ తర్వాత అక్కడి నుంచి లండన్‌ వెళ్తారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి సినిమా పూర్తి చేస్తారట. మొత్తం 80 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసిందట. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రవీణ్‌ సత్తారు ఫుల్‌ ప్లానింగ్‌లో ఉన్నాడనిపిస్తోంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus