Akhil: ‘ఏజెంట్’ కోసం ముందు ఆయన్నే అనుకున్నారట..!

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ‘ఏజెంట్’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జూలై 12 అంటే నిన్నటి నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో మ‌మ్ముట్టి కూడా కీల‌క‌ పాత్ర పోషిస్తున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించడం కోసం అతను రూ.3కోట్లు పారితోషికం డిమాండ్ చేసాడని.. మలయాళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి .. మేకర్స్ కూడా యెస్ చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే ఈ పాత్ర వెనుక చిన్న కథ కూడా నడించింది. ముందుగా ఈ పాత్రలో నటించడానికి నాగార్జున ఇంట్రెస్ట్ చూపించారట. `ఈ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది?` అని సురేంద‌ర్ రెడ్డిని నాగ్ అడిగారట. నాగ్ కనుక నటిస్తే.. మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి వస్తుందని భావించి దర్శకుడు సురేందర్ రెడ్డి వద్దన్నాడట.అంతేకాదు నాగార్జున ఇమేజ్ కు తగినట్టు మార్పులు చేయకపోతే ఆయన అభిమానులు కూడా హర్ట్ అవుతారు. ఒకవేళ మార్పులు చేస్తే అది నాగార్జున మూవీగా బయటకి వస్తుంది.

కాబట్టి అఖిల్ కు పెద్దగా కలిసొచ్చేది ఉండదు.అందుకే సురేందర్ రెడ్డి తెలివిగా నొ చెప్పినట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఆలోచనలతో ఏకీభవించిన నాగ్ ఈ పాత్రకి మ‌మ్ముట్టినే తీసుకోమని చెప్పాడట. అంతేకాదు మొదటి మమ్ముట్టికి ఫోన్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పింది కూడా నాగార్జునే అని తెలుస్తుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus