Nagarjuna: కింగ్ నాగార్జున కొత్త మూవీకి అలాంటి టైటిల్.. ఏం జరిగిందంటే?

అక్కినేని నాగార్జున గత సినిమా ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. దాదాపుగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీగా సక్సెస్ లను సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నాగార్జున ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమ తెరకెక్కుతుందని ప్రచారం జరిగినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే నాగార్జున కొత్త మూవీకి గలాటా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నాగార్జున రెమ్యునరేషన్ సినిమా సినిమాకు పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. కింగ్ నాగార్జున తర్వాత సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా సినిమాకు నాగ్ (Nagarjuna) రెమ్యునరేషన్ పెరుగుతుండగా బిగ్ బాస్ షో ద్వారా కూడా నాగార్జునకు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కుతోంది. అతి త్వరలో బిగ్ బాస్ షో సీజన్7 మొదలుకానుందనే సంగతి తెలిసిందే. నాగార్జున కొత్త తరహా కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన టాలెంట్ తో సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవాల్సి ఉంది. నాగ్ మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అక్కినేని హీరోలైన చైతన్య, అఖిల్ లకు కూడా భారీ విజయాలు దక్కేలా నాగార్జున ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాగ్ కథలను ఎంచుకోవాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్7 కు నాగ్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నా ఈ వార్తలు గాలి వార్తలే అని తెలుస్తోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus