నాగచైతన్య కోసం తాతగా మారిన నాగార్జున
- January 19, 2019 / 07:12 AM ISTByFilmy Focus
నవమన్మధుడు లాంటి నాగార్జున తాతయ్య అంటే నమ్మడం చాలా కష్టమే. కానీ.. నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. నాగార్జున కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న “బంగార్రాజు” సినిమాలో నాగార్జున తాతగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య నటించనున్నాడని సమాచారం. సో, ఈ సినిమాలో నాగచైతన్యకు తాతయ్యగా నాగార్జున కనిపించనున్నాడన్నమాట. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలవ్వనుంది.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “మనం” సినిమాలో నాగచైతన్యకు కొడుకుగా నాగార్జున నటించిన విషయం తెలిసిందే. అదే నాగార్జున ఇప్పుడు నాగచైతన్యకు తాతగా నటించడం అనేది విశేషం. ఈ ప్రొజెక్ట్ తోపాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “మన్మధుడు 2″ ప్రొజెక్ట్ ను కూడా సైమల్టేనియస్ గా మొదలెట్టానున్నాడు నాగార్జున. నిన్నమొన్నటివరకూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న నాగార్జున ‘దేవదాస్” అనంతరం కాస్త బ్రేక్ ఇచ్చి తెలుగులో కాకుండా మలయాళం, హిందీ సినిమాల మీద ఆసక్తి కనబరిచాడు. మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమాలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నాడు.













