నిర్మలా కాన్వెంట్, ఓం నమో వెంకటేశాయ సినిమాలు అపజయం పాలవడంతో ఈసారి హిట్ గ్యారంటీగా కొట్టాలని నాగార్జున కష్టపడుతున్నారు. రాజుగారి గది సినిమాకి సీక్వెల్ చిత్రంపై అసలు పెట్టుకున్నారు. కేవలం ఓంకార్ దర్శకత్వంపైనే సినిమాని వదిలేయకుండా నాగ్ కూడా సినిమా మేకింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత నాగార్జునకు ల్యాగ్ అనిపించినవి తీసేయమని సూచించారు. అందుకు చిత్ర యూనిట్ వెంటనే వాటిని తొలిగించారు. అందులో ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అంతేకాదు ఎంతో ఖర్చు పెట్టి తీసిన రెండు పాటలు కూడా సినిమాలో ఉండవంట.
సినిమాలో సస్పెన్స్ ఉండాలని సీరత్ కపూర్ పై తీసిన హాట్ సాంగ్ తో పాటు సెకెండాఫ్ లో మరో సాంగ్ ను తీసేశారట. దీంతో సినిమాలో రెండే పాటలు ఉండనున్నాయి. ఈ మార్పులతో రాజుగారి గది-2 సినిమా రన్ టైమ్ 2 గంటల 7 నిమిషాల కు తగ్గింది. సినిమా నిడివి తగ్గినప్పటికీ కథ ఎక్కడా మిస్ కాదని, పైగా కథ వేగంగా పరుగులు తీస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. పీవీపీ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది.