Nagarjuna: నా సామిరంగ మూవీకి అదే ప్లస్.. నాగ్ నమ్మకమే నిజమైందిగా!

నాగార్జున విజయ్ బిన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన నా సామిరంగ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల రూపాయల టార్గెట్ తో రిలీజ్ కాగా రెండు రోజుల్లోనే దాదాపుగా 50 శాతం కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. దాదాపుగా 9 కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల చేస్తే నాగార్జున సినిమా హిట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం 72 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించి నాగార్జున నమ్మకాన్ని నిజం చేసింది. స్కీన్లు పెంచితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. నా సామిరంగ మూవీ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో సైతం నాగార్జున సంక్రాంతి పండుగను టార్గెట్ చేసి మరిన్ని సినిమాలను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నా సామిరంగ మూవీ రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత లాభాలను అందిస్తోంది.

నాగార్జున, నాజర్ కాంబో హిట్ కాంబో అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. నాగార్జున (Nagarjuna) త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున పారితోషికం 12 కోట్ల రూపాయల 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగచైతన్య, అఖిల్ కూడా కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలకు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus