Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన నాగార్జున..! ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కి పగిలిగింది..!

బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ వీకండ్ ఎప్పుడొస్తుందా అనే చూస్తారు. ఎందుకంటే, స్టేజ్ పైకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ని చెప్తూ వారికి క్లాస్ పీకుతుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే, ఈసారి నాగార్జున కొంచెం డోస్ పెంచాడు. మొదటి వారమే హౌస్ మేట్స్ కి హడల్ పుట్టించాడు. ఆడియన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈ సీజన్ లో చెప్తాను అంటూ ఒక్కొక్కరికీ మార్కులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో హౌస్ మేట్స్ లో తమకంటే కూడా పక్కన వాళ్లు ఎందులో వీక్ అని ఆడియన్స్ అనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది.

ఇక వీక్ మొత్తం జరిగిన టాస్క్ ల ని ఎనలైజ్ చేస్తూ ఒక్కొక్కరికీ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ప్రియాంక అందరూ ఇక్కడ గెలవడానికే వచ్చారు , ఏదో ఒకటి సాధించడానికే వచ్చారు అన్న మాటల్లో తప్పేముంది అంటూ థామిని కార్నర్ చేసి క్లాస్ పీకారు. దీంతో థామిని దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఇక ప్రిన్స్ యవార్ ని అయితే కండలు పెంచితే , ఫిజికల్ టాస్క్ ఆడితే బిగ్ బాస్ టైటిల్ గెలవచ్చని అనుకుంటున్నావా అంటూ క్లాస్ పీకారు. అమ్మాయిలని ఫ్లట్టింగ్ చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే చేతులు ఎత్తేశావ్ చూడు అంటూ నిలదీసారు.

అలాగే, శోభాశెట్టికి కూడా ఫుల్ క్లాస్ పడింది. ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటే టాప్ 5లో ఉండవని, ఆడియన్స్ కి అస్సలు నచ్చదని చెప్పారు. ఇక రతిక గేమ్ ఆడిన పద్దతిని ఆడియన్స్ కి అలాగే హౌస్ మేట్స్ కి తెలిసేలా క్లియర్ గా చెప్పాడు నాగార్జున. ఉడతా ఉడతా సాంగ్ ని ప్లే చేస్తూ ఇది ఎంత కష్టమైన గేమో తెలుసా అంటూ హౌస్ మేట్స్ కి క్లాస్ పీకారు. అలాగే, శివాజీ వెంటనే గేమ్ ని అర్ధం చేసుకుని బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేసిన తీరుని అభినందించాడు.

శుభశ్రీకి ప్రిన్స్ కి వచ్చిన గొడవకి తెరదింపాడు. గౌతమ్ కి గేమ్ ఆడే పద్దతి గురించి చెప్పాడు. ఇలా హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ అన్నీ అడ్రస్ చేశాడు కింగ్ నాగార్జున. టేస్టీ తేజ టాస్క్ లో పవర్ పెంచాలని, పవర్ అస్త్రం ఎంత ఇంపార్టెంటో మరోసారి స్టేజ్ పైన చెప్పాడు కింగ్ నాగార్జున.

ఇక హౌస్ మేట్స్ గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ? వాళ్లు ఇచ్చిన మార్కులని చెప్పి హౌస్ మేట్స్ గేమ్ ని లైన్ లో పెట్టే ప్రయత్నం చేసారు. మరి ఈ ఇన్ పుట్స్ తీస్కుని వచ్చేవారం హౌస్ మేట్స్ గేమ్ ఎలా ఛేంజ్ చేస్తారు అనేది ఆసక్తికరం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus