Nagarjuna, Nataraj Master: ఫస్ట్ టైమ్ నాగార్జున స్జేజ్ పైన సీరియస్ అయ్యింది అందుకేనా?

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం నాగార్జున నటరాజ్ మాస్టర్ పై ఉగ్రరూపం దాల్చాడు. శివ లుంగీ పైకి లేపిన ఇష్యూ గురించి ఇద్దర్నీ అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. టాస్క్ లో భాగంగా శివ పదిసార్లు నా దగ్గరకి వచ్చి లుంగీ పైకి ఎత్తి చూపించాడని, అంతకుముందు కూడా గడిచిన వారాల్లో ఇలాగే చేష్టలు చేశాడని నటరాజ్ మాస్టర్ శివపై కంప్లైట్ ఇచ్చాడు. దీంతో నాగార్జున శివకి సున్నితంగా క్లాస్ పీకే ప్రయత్నం చేశారు.

నిజానికి అంతకుముందు కన్ఫెషన్ రూమ్ లో యాంకర్ శివ ఈ విషయంపై నాగార్జునతో మాట్లాడాడు. నేను టాస్క్ లో అలా చేశానని అసలు ఆయన ఎందుకు అలాంటి మాటలు అన్నాడో తెలియట్లేదని చెప్పాడు. నటరాజ్ మాస్టర్ కి , యాంకర్ శివకి ఈ విషయంలో పెద్ద ఫైట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నటరాజ్ మాస్టర్ ని కూడా అఢిగి తెలుసుకున్న నాగార్జున మాస్టర్ మద్యలో ఇంటరప్ చేసి మాట్లాడుతుంటే రెచ్చిపోయి మరీ అరిచాడు.

మద్యలో మాట్లాడద్దు మాస్టర్ అని రెండు మూడుసార్లు చెప్పినా కూడా మాస్టర్ వినకుండా మాట్లాడేసరికి నాగార్జున సీరియస్ అయ్యాడు. అసలు విషయాన్ని యాంకర్ శివ చెప్పిన తర్వాత మాస్టర్ కి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. లుంగీ పైకి పదిసార్లు లేపితే పెద్ద బూతు మాట వస్తుందని, అందుకే శివని అలా అన్నాను అంటూ మాస్టర్ చెప్పాడు. అంతేకాదు, టాస్క్ కి ముందు గడిచిన వారాల్లో కూడా అలాగే కుర్తా పైకి లేపి నాకు చూపించేవాడని, దానర్ధం బండబూతు అని మాస్టర్ వాపోయాడు.

ఇక నా ఉద్దేశ్యం అది కాదని యాంకర్ శివ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వి్షయంలో నాగ్ శివకి ఇంకోసారి అలా చేయద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. మాస్టర్ ని కూడా అన్ని మాటలు అనడం అనేది కరెక్ట్ట కాదని, మీ సీనియారిటీ ఇదేనా అంటూ ప్రశ్నించాడు. మొదటి నుంచీ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది.

అలాంటి టైమ్ లో టాస్క్ లో కొద్దిగా అతి చేసిన శివకి నటరాజ్ మాస్టర్ బ్రేకులు వేశాడు. ఇంకోసారి అలా చేస్తే కట్ చేసి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికైతే నాగార్జున తీర్పు చెప్పినట్లుగా సర్ధి చెప్పాడు కానీ, నామినేషన్స్ లో మాత్రం ఈ పాయింట్ ఖచ్చితంగా వచ్చే అవకాశమే కనిపిస్తోంది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus