Bigg Boss 7 Telugu: బాబుగారూ అంటూ కవరింగ్..! శివాజీ చేసిన తప్పేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటేనే ఆసక్తిగా ఆడియన్స్ ఎదురుచూస్తారు. హౌస్మేట్స్ చేసిన తప్పులని హోస్ట్ నాగార్జున కడిగిపారేస్తుంటే ఆనందిస్తారు. హౌస్ లో శివాజీకి సైతం ఫుల్ గా కోటింగ్ ఇచ్చారు కింగ్ నాగార్జున. అయితే, బాబుగారు, బాబుగారూ అంటూ కవర్ చేస్కున్నాడు. 90శాతం ఆన్సర్ చేశాడు. నాగార్జున ముందు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. కానీ, అలాంటి మాటలు మాట్లాడకూడదని ఆ నోటి దూలకి మాత్రం సారీ చెప్పాడు. ఇలాంటి మాటలు మాట్లాడేటపుడు నీ అనుభవం ఏమైంది ? నీ సహనం ఏమైంది ? నీ సమర్ధత ఏమైంది అంటూ ప్రశ్నించాడు కింగ్ నాగార్జున.

దీనికి సహనం , సమర్ధత అనేది సందర్భాన్ని బట్టీ బాబుగారు, సరదాగా మాట్లాడుకునేవి వేరు, సీరియస్ గా గొడవ అయితే తిట్టాననుకోండి అది కంప్లీట్ గా వేరే అర్దంలో ఉంటుంది. ఏది అయినా కూడ ఇలా మాట్లాడటం అనేది తప్పే అని ఒప్పుకున్నాడు. క్షమాపణలు చెప్పాడు. దీనికి కౌంటర్ గా నాగార్జున శోభాశెట్టి సంచాలక్ గా డెసీషన్ తీస్కునే విషయంలో నీ సహనం ఏమైందని ప్రశ్నించారు. ఇంకా తన డెసీషన్ చెప్పకుండానే నువ్వు ఎందుకు ఆర్గ్యూమెంట్ తీస్కున్నావ్ అంటూ మాట్లాడాడు. అక్కడ క్లియర్ గా రూల్ బుక్ లో ఏముంది అనేది ఇంపార్టెంట్ అని , చాలాసేపు అలా బ్యాలన్స్ చేస్తూ నుంచోవడమే గేమ్ అనే విషయాన్ని చెప్పాడు నాగార్జున.

దీనికి శోబాశెట్టి రాంగ్ డెసీషన్ తీస్కున్న తర్వాత వాదించి ప్రయోజనం లేదనే విషయాన్ని శివాజీ గట్టిగా చెప్పాడు. దీంతో కాసేపు అక్కడ ఆర్గ్యూమెంట్ జరిగింది. దీనికి నాగార్జున కౌంటర్ వేశాడు. నీ మైండ్ లో విన్నర్ ని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావ్ కాబట్టే సంచాలక్ గా శోభాశెట్టి తప్పుడు డెసీషన్ తీస్కుంటుందని ఫిక్స్ అయ్యావ్ అంటూ నాగార్జున శివాజీని లాక్ చేశాడు. శోబా ఒక ఆన్సర్ ఇచ్చేస్తుందని మైండ్ లో సెట్ అయిపోయావ్ అంటే, సెట్ అవ్వలేదు, అవ్వకూడదని అరిచా అంటూ కవర్ చేశాడు.

నిజానికి టాస్క్ లో ఫస్ట్ తన కోసమే వాదించాడు. ఆ తర్వాత యావర్ కి సపోర్ట్ గా నిలబడ్డాడు. తనకి ఎవిక్షన్ ఫ్రీసాస్ వచ్చేలా చేయాలనే ఆడాడు శివాజీ. దీనివల్లే ఆర్గ్యూమెంట్ లో శివాజీ ఆర్గ్యూ చేసినా కూడా బలం లేకుండా పోయింది. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే శివాజీతో పాటుగా ఇక్కడ యావర్ కి అలాగే పల్లవి ప్రసాంత్ కి కూడా కోటింగ్ అనేది పడింది. శోభా శెట్టి అయితే సరెండర్ కూడా అయిపోయింది. నేను ఏమీ ఆడలేదు సార్ అంటూ ఒప్పుకుంది కూడా.

తర్వాత రతిక, అశ్విని, వీళ్లిద్దరికి కూడా బాగానే క్లాస్ పడింది. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ప్రకారం శివాజీకి ఎక్కువ నామినేషన్స్, ప్రశాంత్ కి నామినేషన్స్, అలాగే అశ్విని – రతిక ఇలా నామినేషన్స్ అనేదానికోసం వీడియోలు చూపించడం – లాజిక్స్ మాట్లాడటం చేశారు. ఇలా చేస్తేనే నామినేషన్స్ లో హీట్ పెరుగుతుంది. లేదంటే చప్పగా ఉంటుంది. లాస్ట్ టైమ్ ఇలా ఎపిసోడ్ లేదు కాబట్టి పాతవి తవ్వుకున్నారు. మొత్తానికి నాగ్ సర్ ఈసీజన్ లో అద్దిరిపోయే యాంకరింగ్ చేస్తున్నారు. ప్రతి పాయింట్ వాలిడ్ దే అడుగుతున్నారని (Bigg Boss 7 Telugu) నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus