Bigg Boss 7 Telugu: బాటిల్ బ్రేక్ చేస్తూ అశ్వినిని నిలదీసిన నాగార్జున..! అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీపాస్ యావర్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాగార్జున యావర్ చేసిన చీటింగ్ గురించి చాలా క్లియర్ గా వీడియో చూపించారు. దీంతో యావర్ ఆ పాస్ ని తిరిగి బిగ్ బాస్ కి ఇచ్చేశాడు. ఎవిక్షన్ ఫ్రీపాస్ ని స్టోర్ రూమ్ లో పెట్టేశారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని తర్వాత షుగర్ బాటిల్స్ బ్రేక్ చేస్తూ నాగార్జున అందరికీ క్లాస్ పీకారు. ముఖ్యంగా శివాజీని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే, అప్పుడప్పుడు వచ్చే బూతులాండీ అంటూ శివాజీ అడిగాడు.

అవునని, ఈవిషయంలో నీ సహనం ఏమైంది ? ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది ? సమర్ధత ఏమైందంటూ క్లాస్ పీకారు. పిచ్చి పూహా, వెర్రిపూహా ఇలాంటివి హౌస్ లో వాడే పదాలా అంటూ క్లాస్ పీకారు. ఆ తర్వాత రతిక ఫోటోపై వరుసగా మూడు సీసాలు పగలగొట్టి మరీ నాగార్జున సీరియస్ అయ్యారు. వచ్చేవారం నుంచీ నేను ఆడతాను, నేనేంటో చూపిస్తాను అనే పదాలు బ్యాన్ చేసేస్తున్నానని చెప్పాడు. అమర్ కి అయితే నేను విన్నర్ అనుకోకపోతే నువ్వు ఎలా అవుతావ్ ? ఎందుకలా బరెస్ట్ అయ్యావ్ అంటూ సీరియస్ గా చెప్పారు.

మరోవైపు నాగార్జున పల్లవి ప్రశాంత్ ని సైతం కడిగిపారేశారు. (Bigg Boss 7 Telugu) ఈవారం నీ ఆట ఏమైందని అడిగారు. హౌస్ మేట్స్ ఫ్యామిలీస్ వచ్చి నీ ఫోటోలు టాప్ లో పెట్టేసరికి ఇక చాలని అనుకున్నావా ? రిలాక్స్ అయ్యావా అంటూ పల్లవి ప్రశాంత్ ఈవారం ఏం ఆడావ్ చెప్పంటూ మాట్లాడారు. ఆ తర్వాత గౌతమ్ కి కూడా క్లాస్ పడింది. చెల్లెల్ని గెలిపించుకోవడం కోసం గేమ్ ఆడావ్ తప్ప నీ ఆట ఏమైందని అడిగారు. ఆ తర్వాత అశ్వినిని చూస్తూ చేతిపై సీసాని పగలగొట్టి మరీ నాగార్జున సీరియస్ అయ్యారు.

ప్రియాంక నెత్తిమీద సీసా కొట్టగానే ఎందుకలా దెబ్బతగిలనట్లుగా ఫీల్ అయ్యావ్ అంటూ అడిగేసరికి, అప్పుడు నొప్పి అనిపించిందని చెప్పింది అశ్విని. దానికి నేను చేతిమీద కొట్టుకున్నాను కదా.. నాకేమైనా అయ్యిందా అని , బిగ్ బాస్ అన్ని జాగ్రత్తలు తీస్కుంటాడంటూ క్లాస్ పీకారు నాగార్జున. మేబీ నాకి అప్పుడు ఇచ్చిన బాటిల్ వేరే ఉందేమో సార్ అని అమాయకంగా రిప్లై ఇచ్చేసరికి గట్టిగా నవ్వి మరీ క్లాస్ పీకారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తిరిగి ఇచ్చారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే , సోషల్ మీడియాలో అశ్విని ఎలిమినేట్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus