Nagarjuna: నాగార్జున ఇప్పటికి యంగ్ గా కనిపించడానికి అదే కారణమా?

అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈయన హీరోగా నటిస్తూ ఎంతోమంది అమ్మాయిలను అభిమానులుగా మార్చుకున్నారు. ఇండస్ట్రీలో మన్మధుడిగా కొనసాగుతున్నటువంటి నాగార్జునకు విపరీతమైన లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఇప్పటికి నాగార్జునకు అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక నాగార్జున ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ చాలా యాక్టివ్ గా ఉండడమే కాకుండా తన బాడీ కూడా చాలా ఫీట్ గా ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ వయసులో కూడా తాను అలా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున బయటపెట్టారు. తాను తీసుకునే ఫుడ్ కారణంగానే తనబాడి ఎప్పుడు ఒకే విధంగా ట్యూన్ అవుతూ ఉంటుందని నాగార్జున ఈ సందర్భంగా తెలియజేశారు. ఇన్నేళ్ల నుంచి నా బాడీ ఒక సిస్టమ్ లో పడిపోయింది. రోజు ఇది తినాలి, ఈ వ్యాయామం చేయాలి అంటూ ఒకటే రొటీన్ ఉంటుంది.

నట్స్, స్పెషల్ ఫుడ్ తిన్నా మిగిలినవి కూడా తింటాను. కావాలనుకుంటే నేను బరువు పెరుగుతారని లేదనుకుంటే తగ్గిపోతానని నాగార్జున తెలియజేశారు. ఇక రోజంతా తాను ఎలాంటి ఫుడ్ తీసుకున్న నైట్ పడుకునేటప్పుడు మాత్రం కచ్చితంగా ఐస్ క్రీం ఉండాల్సిందేనని ఈయన తెలిపారు. రాత్రి పడుకోవడానికి ముందు ఐస్ క్రీం తినే పడుకుంటానని ఐస్ క్రీమ్ లేకపోతే ఏదో ఒక స్వీట్ తప్పకుండా ఉండాల్సిందేనని

ఈ సందర్భంగా నాగార్జున (Nagarjuna) తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా ఘోస్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా తర్వాత ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు అయితే త్వరలోనే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus