‘బిగ్ బాస్5’ స్టార్ట్ అయ్యి దాదాపు 2 వారాలు కావస్తోంది.ఆల్రెడీ సరయు వంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది.ఇక హౌస్మేట్స్ ఇంట్లో సెటిల్ అవ్వడం ఎలా ఉన్నా కానీ.. గొడవలు పడటం,ఒకరినొకరు తిట్టుకోవడం వంటి వాటితో ప్రేక్షకులకు కావాల్సినంత మాస్ మసాలా ట్రీట్ ఇస్తున్నారు అనేది వాస్తవం. ఈ వారం కూడా నామినేషన్స్ లో క్రేజీ కంటెస్టెంట్ లే ఉన్నారు. ఉమాదేవి, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక సింగ్, అనీ మాస్టర్, ప్రియా వంటి వారు ఉన్నారు.
వీళ్ళలో ఉమాదేవి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. సీజన్ 5 ను కూడా నాగార్జునే హోస్ట్ చేయడంతో ఈసారి కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ నే సొంతం చేసుకుందని ఇన్సైడ్ టాక్. వాటి వివరాలు మరో రెండు రోజుల్లో ప్రకటిస్తారు. అయితే ఈ సీజన్ 5 కోసం నాగార్జున ఎంత పారితోషికం అందుకుంటున్నారు.. అనే విషయం పై కాస్త గట్టిగానే చర్చ జరుగుతుంది.
వరుసగా 3 సీజన్స్ నుండీ హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో నాగార్జునకి ఈసారి పారితోషికాన్ని కూడా పెంచారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ కు గాను నాగార్జున కి ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షల పారితోషికం ఇస్తున్నారట.నాగార్జున 16 రోజుల వరకు అటెండ్ అవుతాడు. కాబట్టి.. నాగార్జున పారితోషకం రూ.4 కోట్ల వరకు ఉంటుందని వినికిడి.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!