డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కాకుండా అతడు చెప్పిన స్టోరీ, టాలెంట్ మీద నమ్మకం పెడుతూ అవకాశాలు ఇచ్చే హీరో అక్కినేని నాగార్జున. ఆయనకు కథ నచ్చితే కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తారు. ప్రజెంట్ ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకు రైటర్‌గా పని చేసిన అహిసూర్ సాలమన్ డైరెక్షన్‌లో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు నాగ్. అందులో ఎన్ఐఏ ఆఫీసర్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. పేపర్లలో చూసిన న్యూస్ ఆధారంగా అహిసూర్ సాలమన్ ఒక స్టోరీ రెడీ చేసుకున్నారు.
దాన్ని నిర్మాత నిరంజన్ రెడ్డికి వినిపించగా, రెండు నెలల తరవాత ఫోన్ చేసి నాగార్జునకి కథ చెప్పామన్నారు. సరేనని వెళ్లి వన్ లైన్‌లో స్టోరీ చెప్పాడు. దానికి నాగ్ అదిరిపోయే సూచనలు ఇచ్చారని డైరెక్టర్ చెబుతున్నారు. ఆ తరవాత మరో రెండు సిట్టింగుల్లో స్టోరీని నాగ్ ఓకే చేశారు. ఆ తరవాత సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అహిసూర్ హిస్టరీ చూస్తే స్టార్ హీరోలు ఎవరైనా అవకాశం ఇవ్వడం అసాధ్యమని చెప్పుకోవాలి.
హిందీలో అతడు డైరెక్ట్ చేసిన ‘జాన్ డే’ కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కాని క్రిటికల్ ఎక్లైమ్ సొంతం చేసుకుంది. తరవాత కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజి నుండి సెట్స్ మీదకు వెళ్ళేలోపు ఆగిపోయాయి. నాగార్జున మాత్రం అతడి స్టోరీ, టాలెంట్ మీద నమ్మకం వుంచి అవకాశం ఇచ్చారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!