రిలీజ్ విషయంలో నాగ్ మనసు మార్చుకున్నాడా..?

టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి ముందుటాడు హీరో నాగార్జున. కమర్షియల్ సినిమాలతో పాటు ఆధ్యాత్మిక చిత్రాల్లో కూడా నటించారు. అలానే ‘గగనం’, ‘ఊపిరి’ లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథల్లో కూడా నటించారు. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ అనే మరో చక్కటి కాన్సెప్ట్ తో కూడిన కథలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది.

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2న నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ల పరిస్థితి మెరుగుపడింది. జనాలు థియేటర్ లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. అంతేకాకుండా.. కేంద్రం వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో ‘వైల్డ్ డాగ్’ దర్శకనిర్మాతలు తమ సినిమాను కూడా థియేటర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తో తాము చేసుకున్న డీల్ లో కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు. సినిమా థియేటర్లో విడుదలైన రెండు వారాల తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసుకునే విధంగా డీల్ మాట్లాడుతున్నారు. మరి ఈ డీల్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన దియామీర్జా నటిస్తుండగా.. సయామీ ఖేర్‌ కీలక పాత్రలో కనిపించనుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus