Nagarjuna: ‘ఆహా’కి పోటీయా.. ఎవరి పని వారిదేనా?

సినిమా పరిశ్రమలో కరోనా తెచ్చిన పెద్ద మార్పు ఏంటంటే… ప్రజలు ఓటీటీకి అలవాటుపడటమే. అప్పటికే మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీలు ఉన్నా కరోనా తర్వాతే ఎక్కువగా అలవాటుపడ్డారు. అయితే మన నిర్మాతలు ఇంకా పూర్తిగా అలవాటుపడలేదు. ఇప్పుడిప్పుడే ఈ లైన్‌లోకి వస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో మరికొన్ని ఓటీటీలు పుట్టుకొస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీలు అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘ఆహా’. ఈనాడు నుండి ‘ఈటీవీ విన్‌’ అని ఒకటి ఉన్నా పెద్దగా యాక్టివ్‌గా లేదు. దీంతో మరో ఓటీటీకి తెలుగులో స్థానం ఉంది అని అక్కినేని నాగార్జున భావిస్తున్నారట.

అన్నపూర్ణ స్టూడియోస్ నుండి త్వరలో ఓ ఓటీటీని తీసుకొచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయాలని నాగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఎలాగూ ఆయన కుటుంబం నుండి పెద్ద సినిమాలు వస్తాయి. సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లకు కొదవ లేదు. దీంతో ఓటీటీ తీసుకొస్తారని టాక్‌. అయితే ఈ ఓటీటీలో నాగ్‌తోపాటు మరికొంతమంది సన్నిహితులు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారట. అయితే వారెవరు అనేది తెలియడం లేదు.

టాలీవుడ్‌లో నాగార్జున, అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య మంచి అనుబంధమే ఉంది. అలాంటిది ‘ఆహా’ పోటీగా మరో ఓటీటీ తెస్తారని అనుకోవడం కష్టమే. కానీ స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే కదా. ఆ లెక్కన మరో ఓటీటీ రావడం పక్కా అంటున్నారు. అయితే ఎప్పుడు, ఎలా అనేది త్వరలో క్లారిటీ రావొచ్చు. ఈ చర్చ అంతా తెలుగు బేస్డ్‌ ఓటీటీల మీదే కావడం గమనార్హం. అందుకే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ పేర్లు ఇందులో చర్చించలేదు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus