Nagarjuna, Rajinikanth: ఆ రోజు లోకేశ్‌ వచ్చి కలిసింది ఇందుకోసమా? కథ చెప్పి ఓకే చేయించుకున్నారా?

కొన్ని రోజుల క్రితం ప్రముఖ కథానాయకుడు నాగార్జునను (Nagarjuna) ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) వచ్చి కలిశారు అనే వార్త బయటకు వచ్చింది. మామూలుగా అయితే సినిమా కథ ఏమన్నా చెప్పారేమో అనే డౌటానుమానం వచ్చేది. అయితే లోకేశ్‌ ఇప్పుడు రజనీకాంత్‌ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో ఉండటం వల్ల ఇప్పుడు నాగ్‌తో సినిమా చేసే అవకాశం లేదు అని అనుకున్నారంతా. అందుకే ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ మీటింగ్‌ బ్లాస్టింగ్‌ కాంబో కోసం అని వార్తలొస్తున్నాయి.

రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాదులో సినిమా షూటింగ్‌ మొదలైంది. రజనీని ఇదివరకు ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ చెప్పడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే నాగార్జున అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూడాలి.

‘కూలీ’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను చేయమని నాగార్జునను అడిగారు అని ఓ టాక్‌ బయటకు వచ్చింది. దానికి నాగార్జున కూడా సానుకూలంగా స్పందించారు అని అంటున్నారు. దీనికి రజనీ సినిమా అని ఒక కారణం, వైవిధ్యమైన పాత్రలు పోషించాలనే తన కోరిక మరో కారణం అని చెబుతున్నారు. చిన్న పాత్రే అయినా చాలా వైవిధ్యంగా రాసుకున్నారట దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. మామూలుగా అయితే ఇలాంటి వార్తలు నమ్మలేం.

కానీ లోకేశ్ కనగరాజ్‌ సినిమాల్లో స్టార్‌ నటులు కాస్త నెగిటివ్‌ షేడ్స్‌లో కనిపించడం అలవాటు. ‘విక్రమ్‌’లో (Vikram) సూర్య (Suriya) చేసిన రోలెక్స్‌ పాత్ర అలాంటిదే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునది కూడా అలాంటి పాత్రే కావొచ్చు అని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమేనా? నాగ్‌ ఈ సినిమాలో ఉన్నారా? అనేది చూడాలి. ఉంటే మాత్రం ఈ సినిమాకు క్రేజ్‌ మరింత పెరుగుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus