Annapurna Studios: నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాల్యూ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్కినేని నాగార్జునకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటూ మరోవైపు నా సామిరంగ సినిమాతో బిజీగా ఉన్నారు. నా సామిరంగ సినిమా మలయాళ మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. నాగ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగార్జున వల్ల అన్నపూర్ణ స్టూడియోస్ విలువ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) విలువ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కావడం గమనార్హం. తెలుగు సినిమాలలో ఎక్కువ సినిమాలు, రియాలిటీ షోలు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. నాగార్జున క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ యంగ్ జనరేషన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంటున్నారు. నాగార్జున త్వరలో కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

మరికొన్ని సంవత్సరాల పాటు నాగ్ వేగంగా సినిమాలలో నటించనున్నారని తెలుస్తోంది. నాగార్జునకు 2024 సంవత్సరంలో కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగ్ మల్టీస్టారర్ సినిమాలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. యంగ్ టాలెంట్ ను నాగ్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా నాగ్ కెరీర్ పరంగా అడుగులు వేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎంతోమంది యంగ్ జనరేషన్ హీరోలకు నాగ్ ఆదర్శంగా నిలుస్తున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే మాత్రం నాగ్ కెరీర్ కు ఢోకా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్7లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుండగా ఈ సీజన్ కచ్చితంగా హిట్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షో కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేశారని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus