‘వైల్డ్ డాగ్’ విషయంలో నాగార్జున డెసిషన్!

సీనియర్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు దర్శకనిర్మాతలు. దానికోసం నెట్ ఫ్లిక్స్ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు, మూడు రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని కూడా అనుకున్నారు. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ కి షాక్ ఇచ్చాడు నాగార్జున.

ముందుగా చేసుకున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. రీసెంట్ గా ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున సినిమా అవుట్ ఫుట్ బాగా నచ్చడంతో.. నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి ఒప్పించాడు. వెంటనే చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేశాడు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి.. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు నిర్మాతలు.

దీన్నిబట్టి ‘వైల్డ్ డాగ్’ ముందుగా థియేటర్లలో ఆ తరువాత మాత్రమే ఓటీటీలో కనిపించనుంది. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ను కూడా మొదలుపెట్టారు. భారీ మొత్తంలో సినిమాను తీసుకోవడానికి బయ్యర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్.. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌ గా నటించారు. దియామీర్జా హీరోయిన్ గా కనిపించనుంది. సయామీ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus