Nagarjuna: మరో ‘ఆఫీసర్’ అనిపించిన ‘వైల్డ్ డాగ్’ టి.ఆర్.పి..!

  • November 18, 2021 / 05:24 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’‌ బ్యానర్‌ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 2న విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్… ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నట విశ్వరూపాన్ని చూపించినప్పటికీ ఆయన పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసినప్పటికీ లాభం లేకుండాపోయింది. అయితే ఓటిటిలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. నెట్ ఫ్లిక్స్ వారికి పెట్టిన పెట్టుబడికి మూడింతల భారీ లాభాలను అందించింది. ఇక ఇటీవల ‘వైల్డ్ డాగ్’ ప్రీమియర్ నవంబర్ 7న జెమినీ టీవీలో ప్రసారం కాగా.. ఇక్కడ మాత్రం జోరు చూపించలేకపోయింది. మొదటిసారి ఈ చిత్రం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 4.70 టి.ఆర్.పి రేటింగ్ నే నమోదు చేసింది.

జెమినీ వారు ఈ చిత్రాన్ని రూ.4.5 కోట్ల రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం. వారు లాభాల బాట పట్టాలి అంటే మరో 3 సార్లు టెలికాస్ట్ అయినప్పుడు ఇదే టి.ఆర్.పి రేటింగ్ నమోదు కావాలి. ఆగష్ట్ లో టెలికాస్ట్ నాగార్జున ‘ఆఫీసర్’ మూవీ స్టార్ మా లో టెలికాస్ట్ అయినప్పటికీ 2.21 టి.ఆర్.పి రేటింగ్ నే నమోదు చేసింది. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ కూడా దానికి ఏమాత్రం తీసిపోలేదని ప్రూవ్ చేసింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus