Radhe Shyam Song: ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా నుంచి నగుమోము తారలే ఫుల్ సాంగ్ విడుదలైంది. ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ గా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినసొంపుగా ఉన్న ఈ పాటకు సిధ్ శ్రీరామ్ తన వాయిస్ తో ప్రాణం పోశారు. జస్టిన్ ప్రభాకరన్ రాధేశ్యామ్ కు సంగీతం అందించగా నగుమోము తారలే పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

పాటలో ప్రభాస్ పూజా హెగ్డే కెమిస్ట్రీ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్లాస్ లుక్ లో ప్రభాస్ రొమాంటిక్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ప్రభాస్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకోవడంతో పాటు బాలీవుడ్ క్లాస్ ఆడియన్స్ లో కూడా ఫాలోయింగ్ ను పెంచుకోవడం గ్యారంటీ అని అర్థమవుతోంది. నగుమోము తారలే సాహిత్యం బాగుంది. సిధ్ శ్రీరామ్ వాయిస్ లో ఈ పాట మామూలుగా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ రాధేశ్యామ్ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకొని రాధేశ్యామ్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో చేరుతుందని చెప్పకనే చెబుతున్నారు. ప్రేమ పాటలను ఇష్టపడే వాళ్లకు నగుమోము తారలే కచ్చితంగా నచ్చుతుంది. 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus