ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నైరా నేహాల్ షా అరెస్ట్ అవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. బర్త్డే పార్టీ లో భాగంగా ఈమె డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈమె తన స్నేహితులకు పార్టీ అరేంజ్ చేసింది. ఇందులో భాగంగా తన స్నేహితుల ఇష్టం మేరకు డ్రగ్స్ కూడా తెప్పించినట్టు పోలీసులకు సమాచారం వెళ్ళింది. దీంతో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి నైరాని అలాగే ఆమె స్నేహితులను అరెస్ట్ చేశారు.
ఈ వేడుకకి గోవాకు చెందిన నైరా స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ ను కూడా హాజరయ్యి.. డ్రగ్స్ లో పాలుపంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ వేడుకలో పాల్గొన్న నైరా నేహాల్ షా మరియు ఆమె స్నేహితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు ముంబై పోలీసులు. తదనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా… ఇద్దరికి బెయిల్ లభించినట్టు పోలీసులు తెలిపారు. అయితే నైరా మరియు ఆమె స్నేహితులు పూర్తిగా బయటపడినట్టు కాదు. అలాగే డ్రగ్స్ ఎక్కడి నుండీ వచ్చాయి అనే కోణం పై పోలీసులు విచారణ జరపడానికి వారెంట్ అందుకున్నట్టు తెలుస్తుంది.
కాబట్టి నైరాని పోలీసులు ఎప్పటికప్పుడు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక నైరా తెలుగులో ఆది హీరోగా వచ్చిన ‘బుర్ర కథ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఈమె బాలీవుడ్లో కూడా బాగా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే.