సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. కోట్లాది రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు, బైక్స్, వాచెస్.. వందల కోట్ల వారు నివసించే బంగ్లాల గురించిన వార్తలు ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే.. ఇక స్టార్ హీరోల భార్యలు కూడా దీనికి ఏమాత్రం తీసిపోరు. వారు ఆఫ్ స్క్రీన్ కెమెరాల కంట పడ్డా కానీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు.
ధరించే ట్రెండీ ఫ్యాషన్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వవటికి సంబంధించి నేషనల్ లెవల్లో న్యూస్ స్ప్రెడ్ అవుతుంటుంది. ఇక స్టార్స్ డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో వెడ్డింగ్స్‌కి పెట్టే ఖర్చు తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. అయితే ఇలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కాస్త తక్కువగానే వినిపిస్తుంటుంది. సినిమాలతో పాటు పలు బ్రాండ్ల యాడ్స్, ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్,
సొంతంగా క్లాతింగ్ బిజినెస్, ఇటీవలే భార్య నమ్రత పేరు మీద ఏషియన్ నమ్రత స్థాపించి భారీగానే సంపాదిస్తున్నారు.
అయితే మహేష్ బాబు సినిమాలతో పాటు వ్యాపార వ్యవహారాలన్నీ సతీమణి నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆమె పబ్లిక్‌లో కనిపిస్తే చాలు అది న్యూస్ అయిపోతుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే స్టైలిష్‌గా మెరిసిపోతుంటారామె. పలు సందర్భాల్లో కెమెరా ముందు కనిపించినప్పుడు నమ్రత స్టైలింగ్ అంటే.. ధరించిన కాస్ట్యూమ్స్, శాండిల్స్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నమ్రత శిరోద్కర్ లగ్జీరీయస్ స్టైలింగ్ బ్రాండ్స్ మరియు వాటి కాస్ట్ వివరాలు..