సుధీర్ బాబు (Sudheer Babu) .. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) అల్లుడిగా, మహేష్ బాబు (Mahesh Babu) బావగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఎస్.ఎం.ఎస్’ ‘ ప్రేమకథా చిత్రం’ (Prema Katha Chitram) ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) ‘సమ్మోహనం’ (Sammohanam) వంటి మంచి సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా ఇతను సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. మొత్తానికి ‘హరోం హర’ (Harom Hara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న అంటే జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందని..
సెకండాఫ్ రొటీన్ గా ఉందని అన్నారు. అయినప్పటికీ హీరో ఎలివేషన్స్ బాగున్నాయని, మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందనే టాక్ వచ్చింది. ఈ సినిమా ద్వారా ‘నవ దళపతి’ అనే ట్యాగ్ ను సుధీర్ బాబుకి కట్టబెట్టాడు దర్శకుడు. మరోపక్క మొదటి రోజు బుకింగ్స్ కూడా కొంత పర్వాలేదు అనిపించాయి. ఇదిలా ఉండగా.. సుధీర్ బాబులో ఇంత మాస్ యాంగిల్ ఉందని చాలా మందికి తెలీదు. ఎవరూ ఊహించి ఉండరు కూడా..! మరోపక్క సుధీర్ బాబు..
కథలు ఇప్పటివరకు కృష్ణ, మహేష్ బాబు..లు మాత్రమే వినేవారట. అలా అని వాళ్ళు ఏ విధమైన మార్పులు చెప్పేవారు కాదని సుధీర్ బాబు చెప్పాడు. అయితే మొదటిసారి ‘హరోం హర’ కథని నమ్రత (Namrata Shirodkar) కూడా విని తగిన మార్పులు చెప్పిందట. వాటిని సుధీర్ బాబు, దర్శకుడు జ్ఞాన సాగర్ (Gnanasagar Dwaraka) సీరియస్ గా తీసుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేశారట. సో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వెనుక ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు.