Namrata, Mahesh Babu: సినిమాలకు అందుకే దూరంగా ఉంటున్నా.. నమ్రత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత జంట ఒకటి అని చెప్పాలి. వంశి సినిమాతో ఇద్దరు కలిసి నటించి ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట అనంతరం పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. కాకపోతే పెళ్లికాకముందు నమ్రత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లి అయిన తర్వాత పూర్తిగా ఈమె వైవాహిక జీవితంలో స్థిరపడి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతలను పిల్లల ఆలన పాలన, వారి చదువు బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక గృహిణిగా ఈమె స్థిరపడిపోయారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మహేష్ బాబుకి ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే మమ్మల్ని టూర్స్ తీసుకువెళ్తూ ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. ఇక మేము కూడా పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తూ మాకు నచ్చిన ఫుడ్ తింటే ఎంతో ఎంజాయ్ చేస్తామని తెలిపారు.

ఇకపోతే మహేష్ బాబును వెంట తీసుకొని షాపింగ్ వెళ్లడం ఎంతో కష్టమైన పని. తన భర్తకు కావలసిన షాపింగ్ కూడా తనే చేస్తానని,తనకోసం మాత్రం మహేష్ బాబు ఎలాంటి షాపింగ్ చేయడని ఈ సందర్భంగా నమ్రత మహేష్ బాబు గురించి తెలియజేశారు. ఇకపోతే తనకు దుబాయ్ అమెరికాలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు.నిజం చెప్పాలంటే మహేష్ బాబుకి షాపింగ్ చేసే అంత సమయం కూడా లేదని అందుకే తనకు కావాల్సిన వాటిని కూడా నేనే షాపింగ్ చేస్తానని తెలిపారు.

ఇక చాలామంది తనను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే చాలా మంది అభిమానులను తాను బాధ పెడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను కుటుంబాన్ని చూసుకోవడం ఎంతో బిజీగా ఉన్నానని, తన కుటుంబాన్ని చూసుకోవడంలో ఎంతో సంతృప్తిగా ఉన్నానని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని ఈ సందర్భంగా నమ్రత తన రీ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus