Namrata: వైట్ హెయిర్ తో నమ్రత ట్రెండీ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ మధ్య స్టార్ హీరోల భార్యలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వాళ్ళు కూడా తమ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పందుకుంటూ ఉంటున్నారు. ఇందుకు.. మహేష్ సతీమణి నమ్రత కూడా అతీతం కాదు. ఎప్పుడూ తన భర్త, పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది నమ్రత. మహేష్ కొత్త సినిమాలు, బ్రాండ్ లకు సంబంధించిన వివరాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే మహేష్ కొత్త సినిమాల ప్రమోషన్స్ ను దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్లు వెళ్తున్నప్పుడు అక్కడి ఫోటోలను కూడా నమ్రతనే షేర్ చేస్తూ ఉంటారు. అలాగే మహేష్ దత్తత తీసుకున్న గ్రామాలు బుర్రిపాలెం, సిద్దాపురం లలో… జరిగే సోషల్ యాక్టివిటీస్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా నమ్రత కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ హెయిర్ తో అదే క్రమంలో చాలా ట్రెండీగా కనిపించి ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తాహిలాని డిజైన్ చేసిన డ్రెస్ లో నమ్రత … ఈ ఫోటో షూట్లో పాల్గొన్నారు.

ఈ ఫోటోలకు నమ్రత చెల్లెలు శిల్పా శిరోద్కర్.. ‘లవ్ యు చిన్’ అంటూ కామెంట్ పెట్టింది. నమ్రత ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉండటంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus