Balakrishna: అన్ స్టాపబుల్ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

2021 సంవత్సరం చాలామంది స్టార్ హీరోలకు నిరాశను మిగిల్చినా నందమూరి బాలకృష్ణకు మాత్రం లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు. ఒకవైపు అఖండ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న బాలకృష్ణ మరోవైపు అన్ స్టాపబుల్ షో ద్వారా సక్సెస్ సాధించారు. ఈ టాక్ షో వ్యూస్ పరంగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. బాలయ్య తర్వాత సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చాలాసార్లు తన వయస్సు 16 అని చెబుతారనే సంగతి తెలిసిందే. బాలయ్య సరదాగా ఆ విషయం చెబుతారని చాలామంది అనుకుంటారు. అయితే బాలయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా రంగం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అఖండ విడుదలైందని బాలయ్య అన్నారు. మంచి సినిమా అయిన అఖండ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడంలో ఆశ్చర్యం లేదని బాలయ్య చెప్పుకొచ్చారు.

అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ గురించి చెప్పగానే కొత్తదనాన్ని కోరుకునే తాను ఓకే చెప్పానని నాన్నగారు కూడా రెండు దశాబ్దాల ముందుగా ఆలోచించేవారని ఆ ఆలోచనలతో నాన్నగారు కొన్ని సినిమాలు తీయగా ఆ సినిమాలు సక్సెస్ కాలేదని బాలయ్య అన్నారు. కొత్తదనం కోరుకోవడం వల్లే చాలా సంవత్సరాల క్రితమే ఆదిత్య369 చేశామని బాలయ్య చెప్పారు. అన్ స్టాపబుల్ ద్వారా ఆర్టిస్టులలోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించాలని అనుకున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. నా ఆలోచనలు పదహారేళ్లలా ఉంటాయి కాబట్టే షోలో అలా చెబుతానని బాలయ్య కామెంట్లు చేశారు.

అన్ స్టాపబుల్ లాంటి ప్రపోజల్ తో ఎవరు వచ్చినా ఓకే చెప్పేవాడినని బాలయ్య వెల్లడించారు. రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న చనువు వల్లే అరవింద్ గారు టాక్ షో గురించి అడిగారని బాలయ్య చెప్పుకొచ్చారు. దేశంలోనే నంబర్ 1 టాక్ షోగా అన్ స్టాపబుల్ నిలిచినందుకు సంతోషమని బాలయ్య తెలిపారు. బాలయ్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus