Balakrishna: బాలయ్య భార్య వసుంధర మెట్టింటికి తెచ్చిన కట్నం ఎంతంటే?

దివంగత నటుడు, ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకుంట. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో రాణించారాయన. ఇక రామారావు గారికి 11 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. వారిలో ఏడుగురు అబ్బాయిలు.. నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అయితే జనాలకి బాలకృష్ణ, హరికృష్ణ లు మాత్రమే తెలిసి ఉంటుంది.

మిగిలిన వారు సినిమాల్లో రాణించలేకపోయారు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.ఇదిలా ఉండగా… 11 మంది సంతానంలో ఆయన చిన్న కొడుకు బాలకృష్ణ మాత్రమే సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించగలుగుతున్నాడు. ఎన్టీఆర్ కు కూడా తన చిన్న కొడుకు బాలకృష్ణ అంటే ఇష్టమే. చిన్న కొడుకు కాబట్టి… అతన్ని చాలా గారంగా చూసుకునేవారట. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్.. ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. అదే టైములో ఎన్టీఆర్ భార్య బసవతారకం గారు చిన్న కొడుకుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని ఎన్టీఆర్ పై ఒత్తిడి చేసేవారట.

దాంతో ఎన్టీఆర్ గారు ఆ బాధ్యతని తన సహచరుడు, ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావుకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇక భాస్కరరావు గారు ఆయన బంధువుల అమ్మాయినే బాలయ్యకి ఇచ్చి పెళ్లి చేసినట్టు తెలుస్తుంది. ఆమెనే వసుందర. ఈమె ఆంద్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి. ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట. అప్పట్లో బాలయ్యకి ఈమె కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు కట్నం ఇచ్చారట. అదే డబ్బుతో హైదరాబాద్ లో ఓ ఇల్లు కట్టించి ఇచ్చారని గతంలో నాదేండ్ల భాస్కర రావు గారు తెలిపారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

 

27

28

29

30

31

32

33

 

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus