Balakrishna: ఫ్యాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు (Balakrishna)  ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. ప్రస్తుతం బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీ ఓర్వకల్లులో జరుగుతుండగా సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఊరమాస్ అనే టైటిల్ వినిపించగా ఇప్పుడు మాత్రం మరికొన్ని టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. స్టార్ హీరో బాలయ్య ఈ సినిమాలో డాన్ గా కనిపించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

బాలయ్య ఫ్యాన్స్ పై సీరియస్ అవుతారని గతంలో చాలా సందర్భాల్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య అభిమానితో కలిసి భోజనం చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ బాలయ్యను కలవగా అతనితో బాలయ్య ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాలయ్యతో కలిసి భోజనం చేయడంతో సజ్జద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్యను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలలో బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ 100 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. బాలయ్య తర్వాత సినిమాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఉండాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. బాలయ్య తర్వాత సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

బాలయ్య బాబీ మూవీ బిజినెస్ విషయంలో అదరగొడుతుండగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో లక్ పరీక్షించుకోనున్నారు. బాలయ్య సినిమాల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus