నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఈ దసరా కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి వీకెండ్ లో తమిళ క్రేజీ మూవీ ‘లియో’ కారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ విషయం లో కాస్త తడబడినా, ఆ తర్వాత పండగ సెలవుల్లో మాత్రం అన్నీ చిత్రాల మీద భారీ లీడ్ ని తీసుకుంది.మొదటి వీకెండ్ వసూళ్లను చూసి కచ్చితంగా కనీసం 15 కోట్ల రూపాయిలు బయ్యర్స్ నష్టపోతారేమో అని అనుకున్నారు.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి దసరా పండగ సెలవులు కలిసి వచ్చాయి. మొదటి ఆరు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ మార్కుని సాధించి బయ్యర్స్ లో ఉన్న అపోహలను తొలగించింది. ఇక ఈ ఒక్క వీకెండ్ బాగా ఆడితే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేస్తుంది.ఇకపోతే బుక్ మై షో మరియు పేటీఏం లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు రెండు మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.
రీసెంట్ సమయం లో ఒక టాలీవుడ్ చిత్రానికి(Bhagavanth Kesari) ఈ రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడుపోవడం ఈ చిత్రానికే దక్కింది. బాలయ్య బాబు తో ఇంతటి ఎమోషనల్ సినిమా తీసి సక్సెస్ అయ్యాడంటే అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ కి మెచ్చుకోవాల్సిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు లెక్కల ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్ ఇప్పట్లో ఆగదని, కచ్చితంగా మరో రెండు మూడు వారాలు లాంగ్ రన్ ఉంటుందని అంటున్నాడు.
ఫ్యామిలీ ఆడియన్స్ రోజు రోజుకి ఈ సినిమాకి పెరుగుతూ పోతున్నారట. ఫుల్ రన్ లో కచ్చితంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.