Balakrishna: గూస్ బంప్స్ వచ్చేలా ఎన్బీకే 109 పోస్టర్.. త్రివిక్రమ్ సాయంతో?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో బాలకృష్ణతో పని చేయాలని ఆశ పడే దర్శకుల సంఖ్య పెరుగుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబీ కాంబో సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఈ పోస్టర్ చూస్తే అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.

భగవంత్ కేసరి టీజర్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండటంతో పాటు ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఊరమాస్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. బుల్లెట్లు, సుత్తి, గొడ్డలి, మందు బాటిల్ తో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉందనే సంగతి తెలిసిందే.

బాలయ్య పాత్రకు సంబంధించి క్లారిటీ లేకపోయినా నెక్స్ట్ లెవెల్ లో బాబీ ప్లాన్ చేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర కూడా అదే సమయానికి థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

బాలయ్య (Balakrishna) తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతుండగా వరుస విజయాలతో బాలయ్య కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బాబీ సినిమాకు త్రివిక్రమ్ భార్య కూడా నిర్మాత కావడంతో ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ మార్క్ కూడా ఉండే అవకాశం ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus