నందమూరి ఫ్యామిలీని టెన్షన్ పెట్టిన యాక్సిడెంట్.. ఏమైందంటే?

నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.. తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కుప్పకూలి పడిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటు రావడంతో అతను అలా పడిపోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న ఓ హాస్పిటల్ లో అతన్ని అడ్మిట్ చేయగా.. పరిస్థితి విషమించడంతో బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే అతని ప్రాణానికి వచ్చిన ముప్పు తొలగిపోయినప్పటికీ.. ఇప్పటికీ అతను స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ పైనే పడి ఉన్నాడు.

అవయవాల పనితీరు మెరుగుపడినప్పటికీ అతని మెదడు పనిచేయడం లేదు అని వైద్యులు తెలిపారు. ఇటీవల అతని మెదడుకి చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ విదేశాలకు పంపారు. అక్కడి వైద్యులు వాటిని పరిశీలించి అవసరమైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి తారకరత్న మెదడుకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదంటే తారకరత్ననే విదేశాలకు షిఫ్ట్ చేయమనడం జరుగుతుంది. ఏదేమైనా తారకరత్న ఇంకా సాధారణ స్థితికి రాకుండా హాస్పిటల్ బెడ్ పై పడుంటే ఈలోపు నందమూరి బాలకృష్ణ సోదరుడు అయిన నందమూరి రామకృష్ణ కారుకు యాక్సిడెంట్ అవ్వడం అందరినీ టెన్షన్ కు గురిచేస్తుందనే చెప్పాలి.

హైదరాబాద్ లో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. నందమూరి రామకృష్ణ శుక్రవారం ఉదయం కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో వెళ్తుండగా కంట్రోల్ తప్పి డివైడర్ ని ఢీ కొట్టడం జరిగింది.దీంతో కారు ముందు భాగం అంతా ధ్వంసమైంది.అయితే రామకృష్ణకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. కారుని పక్కనే పార్క్ చేసి ఆయన వెళ్లిపోవడం జరిగింది.తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఆ కారుని తీసుకెళ్లడం జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు కేసు వంటివి నమోదు చేయలేదని తెలుస్తోంది

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus