Chaitanya Krishna: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ మనవడు చైతన్యకృష్ణ కామెంట్స్!

సీనియర్ ఎన్టీఆర్ మనవడు చైతన్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల క్రితం ధమ్ సినిమాలో నటించిన చైతన్యకృష్ణ ఇప్పుడు బ్రీత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్యకృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం. లక్ష్మీపార్వతి వల్ల కుటుంబానికి మంచి జరగలేదని ఆమె ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుందని చైతన్యకృష్ణ అన్నారు. లక్ష్మీపార్వతి రూపంలో మా కుటుంబంలోకి శని వచ్చిందని ఆయన తెలిపారు.

పార్టీని కాపాడాలనే ఆలోచనతో చంద్రబాబు గారు పార్టీని టేకోవర్ చేశారని చైతన్యకృష్ణ తెలిపారు. లక్ష్మీపార్వతి అంటే మా నాన్నకు కూడా ఇష్టం లేదని మామయ్యది వెన్నుపోటే కాదని చైతన్యకృష్ణ అన్నారు. బాలయ్య పాలిటిక్స్ లో ఉంటూ సినిమాలు, రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నారని చైతన్య కృష్ణ అన్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీ నుంచి సీఎం అయ్యేది బాలయ్య అని ఆయన కామెంట్లు చేశారు.

బాలయ్య సీఎం అయిన తర్వాత లోకేశ్ సీఎం అయ్యే అవకాశం ఉందని చైతన్య కృష్ణ అన్నారు. బ్రీత్ మూవీ ఈవెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యే ఛాన్స్ ఉందని ఆయన కామెంట్లు చేశారు. చైతన్య కృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకింత భారీ బడ్జెట్ తోనే బ్రీత్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

బ్రీత్ సినిమా నందమూరి ఫ్యామిలీ హీరోకు మరో సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2021 డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా విడుదల కాగా ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన బ్రీత్ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ సెంటిమెంట్ ఈ నందమూరి హీరోకు కలిసొస్తుందేమో చూడాలి. నందమూరి చైతన్య కృష్ణ (Chaitanya Krishna) ప్రమోషన్స్ ద్వారా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus