Nandamuri Harikrishna: ఆ ఈవెంట్ లో పూరీ భార్య గొప్పదనం చెప్పిన హరికృష్ణ.. ఏమైందంటే?

  • June 7, 2024 / 08:57 PM IST

సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) కొడుకు హరికృష్ణ (Harikrishna) మరణించి దాదాపుగా ఆరేళ్లు అవుతున్నా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక సందర్బంలో ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు. సినిమాల్లో, రాజకీయాల్లో సత్తా చాటిన అతికొద్ది మందిలో హరికృష్ణ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఒక ఈవెంట్ లో భాగంగా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇజం మూవీ షూట్ సమయంలో నేను పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇంటికి వెళ్లగా పూరీ జగన్నాథ్ భార్య లావణ్య ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఏం తీసుకుంటారని అడిగిందని హరికృష్ణ పేర్కొన్నారు.

కాఫీ తీసుకుంటానని చెప్పిన వెంటనే ఎంతో రుచిగా ఉండే కాఫీని ఆమె నాకు ఇచ్చారని ఆయన వెల్లడించడం గమనార్హం. ఆమె ఆప్యాయంగా పలకరించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన వెల్లడించారు. పూరీ భార్య సంస్కారాన్ని హరికృష్ణ ఇంతలా పొగడటంతో కాఫీ ఇస్తే ఇంతలా పొగడాలా అని పూరీ అన్నారు. ఆ కామెంట్ కు హరికృష్ణ రియాక్ట్ అవుతూ నేను నా మనస్సులో అనిపించింది చెప్తానని నేను ఏదీ దాచుకోనని దాచుకోలేనని కామెంట్ చేశారు.

ఆ తర్వాత హరికృష్ణ మాట్లాడుతూ లైఫ్ లో ఎన్ని దెబ్బలు తగిలినా ఎవడికీ తలవంచనని కృతజ్ఞత మాత్రం తెలియజేస్తానని ఆయన వెల్లడించారు. నేను తల వంచే వాడిని అయితే సీనియర్ ఎన్టీఆర్ కడుపున పుట్టేవాడిని కాదని హరికృష్ణ చెప్పుకొచ్చారు. హరికృష్ణ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

నందమూరి హరికృష్ణ కొడుకులు ప్రస్తుతం వరుస విజయాలతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమాలో నటిస్తుండగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తర్వాత మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలోనే జరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus