Nandamuri Heroes: ఒకే ఫ్రేమ్ లో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ .. ఫ్యాన్స్ సంతోషించేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా ఈ హీరోలు భిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. నందమూరి హీరోలు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా నందమూరి సుహాసిని కొడుకు హర్ష వివాహం గ్రాండ్ గా జరగగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఒక ఫోటోలో బాలయ్యను తారక్ ప్రేమగా పలకరించడం గమనార్హం. చాలాకాలం తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య, తారక్ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని ఈ ఫోటోతో మరోసారి క్లారిటీ వచ్చింది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య, తారక్ కాంబినేషన్ లో సినిమా వస్తే (Nandamuri Heroes) నందమూరి ఫ్యాన్స్ కు సంతోషం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బాలయ్య, తారక్ లకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. పలు సేవా కార్యక్రమాల ద్వారా బాలయ్య మంచి మనస్సును చాటుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా తారక్ దేవర సినిమాలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు మాస్ సినిమాలు కాగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనున్నాయని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమాలు ఉండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య, తారక్ రేంజ్ ను ప్రూవ్ చేసేలా ఈ సినిమాలు భారీ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య, తారక్ తమ సినిమాల కలెక్షన్లతో ఇతర హీరోలకు భారీ షాకులిస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus