మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీలో కూడా మొదలైన పెళ్లి సందడి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీస్ అంటే మెగా మరియు నందమూరి కుటుంబాల గురించే ఎక్కువగా చెబుతుంటారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లి సంబరాల్లో ఉంది. డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరుగబోతోంది. ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా పెళ్లి వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అయిన జయకృష్ణ కొడుకు..

చైతన్య కృష్ణ నిశ్చితార్థ వేడుక డిసెంబర్ 6న జరిగింది. ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ మరియు అతని కొడుకు మోక్షజ్ఞ హాజరయ్యి సందడి చేసారు. ఇక చైతన్య కృష్ణ కూడా నటుడే..! గతంలో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ అనే చిత్రంలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఆయన సినిమాల వైపు చూడలేదు. అయితే రాజకీయాల్లో మాత్రం అప్పుడప్పుడు మెరిసేవాడు. తెలుగుదేశం పార్టీ తరుపున ఈయన ప్రచారం చేసాడు.

ఒకానొక సందర్భంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని ల పై సెటైర్లు కూడా వేసాడు. ఇక చైతన్య కృష్ణ నిశ్చితార్ధ వేడుక కోవిద్ నిబంధనలను పాటిస్తూ చాలా సింపుల్ గా జరిగింది. చెప్పాలంటే పూర్తిగా నందమూరి కుటుంబసభ్యులే హాజరు కాలేదు. అయితే అతని పెళ్లికైనా జయకృష్ణ, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు హాజరవుతారా అనే డిస్కషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి.

1

2

3

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus