ఆ బ్యానర్ లోనే తొలి మూవీ చేయనున్న బాలకృష్ణ తనయుడు
- January 12, 2017 / 12:20 PM ISTByFilmy Focus
మహానటుడు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు బాలకృష్ణ. నేటి యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వందవ చిత్ర మైలురాయిని ద్విగ్విజయంగా క్రాస్ చేశారు. అలాగే ఎన్టీఆర్ మనవుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చిత్ర రంగ ప్రవేశం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017 చివర్లో తన వారసుడి సినిమా వస్తుందని కొంతకాలం క్రితం బాలకృష్ణ మీడియా ముఖంగా చెప్పారు. ఇప్పుడు అదే ఆపనుల్లో ఉన్నారు. ఈ చిత్రం డైరక్టర్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోయినప్పటికీ నిర్మాత ఖరారు అయిపోయారు. మోక్షజ్ఞ తమ బ్యానర్లో తొలి చిత్రం చేస్తారని సాయి కొర్రపాటి ఈ రోజు స్పష్టం చేశారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత అయిన సాయి బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కి వైజాక్, సీడెడ్ లలో పంపిణీ దారుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సాధించిన విజయాన్ని మీడియా మిత్రులతో పంచుకుంటూ మోక్షజ్ఞ మొదటి చిత్రం సంగతులు వెల్లడించారు. “మోక్షజ్ఞను మా బ్యానర్లోనే పరిచయం చేయిస్తానని బాలయ్య నాకు మాట ఇచ్చారు. కాబట్టి నవయువ నటరత్న వారాహి చలన చిత్ర బ్యానర్ లోనే మొదటి సినిమా చేస్తారు” అని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ ఫిల్మ్ గురించి ఇతర విషయాలను చెప్పడానికి సాయి కొర్రపాటి నిరాకరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















