Mokshagna: తండ్రిని విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల ఎంతోమంది తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇలా ఎన్టీఆర్ యూనివర్సిటీ పై విమర్శలు చేస్తున్నటువంటి తెలుగుదేశం నేతలపై వైయస్సార్సీపి నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ చేసిన ట్వీట్ పై వైసిపి నేత మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. టిడిపి హయాంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కట్టలేకపోయినా హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరును ఎలా పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను మీరంతా కలిసి చంపేశాకే కదా ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టింది. పేరు పెట్టినంత మాత్రాన చేసిన పాపం పోతుందా బాలకృష్ణ అంటూ ట్వీట్ చేశారు.అయితే బాలకృష్ణ పై మంత్రి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో

ఆయనకు మద్దతుగా తన కుమారుడు మోక్షజ్ఞ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలయ్య గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కుక్కలు మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీకోలేరు..అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చారు. అవసరం తీరిపోగానే కారు కూతలు కూస్తున్నారు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ తన తండ్రికి మద్దతుగా నిలబడి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus