Mokshagna, Trivikram: బాలయ్య ప్లాన్ మార్చారా.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన అప్పుడేనా?

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం తన లుక్ ను సైతం మార్చుకున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావించినా ఆ వార్తలు నిజం కాలేదు. బాలయ్య వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే మోక్షజ్ఞ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ లో ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది. గుంటూరు కారం మూవీ తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఆదిత్య 999 మ్యాక్స్ కు బదులుగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

సొంత బ్యానర్ లోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించేలా బాలయ్య ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్షన్ ఛాన్స్ కోసం చాలామంది డైరెక్టర్లు క్యూ లైన్ లో ఉన్నారని తెలుస్తోంది. బాలయ్య త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రావాలని కూడా కొంతమంది ఫీలవుతున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మోక్షజ్ఞ (Mokshagna) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సక్సెస్ సాధిస్తే పలువురు పాన్ ఇండియా డైరెక్టర్లు మోక్షజ్ఞతో సినిమా చేయాలని భావిస్తున్నారు. మోక్షజ్ఞ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. త్వరలో మోక్షజ్ఞ కొత్త ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus