Mokshagnya: మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు జరిగేది అప్పుడేనా?

నందమూరి హీరో మోక్షజ్ఞ (Mokshagnya) సినీ ఎంట్రీకి సంబంధించిన శుభవార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మోక్షజ్ఞ ఈ సినిమా కోసం ఏకంగా 18 కిలోలు బరువు తగ్గాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన రావడంతో ఇకపై మోక్షజ్ఞ ప్రతి పుట్టినరోజు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్లతో అభిమానులకు స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ (Prasanth Varma)   సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పరిచయం చేసే సూపర్ హీరోలలో మోక్షజ్ఞ కూడా ఒకరని తెలిసి ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

Mokshagnya

మోక్షజ్ఞ (Mokshagnya) ఫస్ట్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తారని గతంలో వార్తలు వినిపించగా ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఓపెనింగ్ కు ఫ్యాన్స్ కు సైతం ఆహ్వానం అందనుందని కొంతమంది అభిమానులకు ఈ ఈవెంట్ లో పాల్గొనే ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బాలయ్యకు  (Balakrishna) సన్నిహితులైన ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని భోగట్టా.

కుదిరితే దసరాకు లేదంటే కార్తీకమాసంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మోక్షజ్ఞ (Mokshagnya) తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరుత (Chirutha) సినిమాతో రామ్ చరణ్ (Ram Charan) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎంత చర్చ జరిగిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే భారీ హిట్ సాధిస్తే కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆ తప్పులు చేయడమే శంకర్ కెరీర్ పాలిట శాపం అవుతోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus