Shankar: ఆ తప్పులు చేయడమే శంకర్ కెరీర్ పాలిట శాపం అవుతోందా?

  • September 8, 2024 / 08:28 PM IST

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తన సినిమాలతో శంకర్(Shankar) సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒకే ఒక్కడు, జీన్స్ (Jeans) , అపరిచితుడు, శివాజీ (Sivaji) , రోబో (Robo) సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు శంకర్ పేరు సమాధానంగా వినిపించింది. ఇప్పుడు మాత్రం శంకర్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో నిరాశపరుస్తున్నారు. శంకర్ ఎంచుకునే కథలు బాగానే ఉన్నా కథనం విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయి.

Shankar

శంకర్ (Shankar) సినిమాల బడ్జెట్లు సైతం హద్దులు దాటుతుండటంతో సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగుల్చుతున్నాయి. శంకర్ ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తున్నారు. అంత సమయం తీసుకున్నా ఆ స్థాయి ఔట్ పుట్ మాత్రం రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. శంకర్ (Shankar) కెరీర్ ను గేమ్ ఛేంజర్ (Game Changer)  డిసైడ్ చేయనుందని ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ సక్సెస్ సాధిస్తే మాత్రం దర్శకుడు శంకర్ కు కొత్త మూవీ ఆఫర్లు వస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ ఎర్ర తువాళులో కనిపించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుండగా డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించకపోవడంపై కూడా ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ డేట్ ను మిస్ చేసుకుంటే మాత్రం ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం కష్టమవుతుందని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus