Mokshagnya: మోక్షజ్ఞ నెంబర్ 2 – లైన్ లోకి కంటెంట్ ఉన్న డైరెక్టర్!

నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) సినీ ప్రయాణం గ్రాండ్ గా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ సినిమాతో రానున్న మోక్షజ్ఞపై నందమూరి అభిమానులలో అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఈ సందడి ఇంకా తగ్గకముందే, మోక్షజ్ఞ రెండో సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో మోక్షజ్ఞ కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

Mokshagnya

‘తొలిప్రేమ (Tholi Prema) , సార్ (Sir), లక్కీ భాస్కర్’ (Luky Bhasker) వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వెంకీ, మోక్షజ్ఞ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంపై మంచి నమ్మకం ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ మరింత హైప్‌ను తెచ్చుకుంటుంది. సౌత్‌తో పాటు హిందీ బెల్ట్‌లో కూడా మోక్షజ్ఞకు మంచి పాపులారిటీ రాబట్టడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమట.

బాలకృష్ణ తనయుడి మొదటి సినిమా ప్రాజెక్ట్‌ను ఎలాగైతే జాగ్రత్తగా ప్లాన్ చేశారో, రెండో సినిమాను కూడా అంతే ప్రాముఖ్యతతో ప్లాన్ చేస్తున్నారు. మొదటి చిత్రానికి ప్రశాంత్ వర్మ లాంటి కొత్తదనాన్ని చూపగల దర్శకుడిని ఎంపిక చేయగా, రెండో చిత్రానికి సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్‌ను తీసుకోవడం వెనుక వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక నందమూరి అభిమానులు ఈ రెండు చిత్రాలపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. వెంకీ అట్లూరి కథకు బాలకృష్ణ (Balakrishna) కుటుంబం పచ్చజెండా ఊపిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది చివర్లో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అధికారిక ప్రకటన రాగానే ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని ఆసక్తికర వివరాలు బయటకు వస్తాయి.

పుష్ప 2: అక్కడ టిక్కెట్ 3000.. రీజన్ ఏంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus