Nandini Reddy: నీకు గర్ల్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటున్నా.. వెరైటీగా విషెస్ చెప్పిన నందిని రెడ్డి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ నందిని రెడ్డి ఒకరు. ఈమె పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇక ఈమె నటుడు రాహుల్ రవీందర్ చిన్మయి సమంత వంటి వారికి ప్రాణ స్నేహితురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇక కొత్త సంవత్సరం కావడంతో నందిని రెడ్డి రాహుల్ రవీందర్ కు స్పెషల్ గా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.

ఈమె ట్విట్టర్ వేదికగా నటుడు రాహుల్ రవీందర్ కు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.. హ్యాపీ న్యూ ఇయర్ రాహుల్ ఈ ఏడాదైన నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటున్నాను… నీ భార్య కూడా ఇదే కోరుకుంటుంది. ఆమె ఏమీ అనుకోదు అంటూ ఈమె చాలా వెరైటీగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా నందిని రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడంతో రాహుల్ ఆమెకు రిప్లై ఇస్తూ అందుకు సంబంధించిన పోస్ట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నందిని రెడ్డి చెప్పినటువంటి విషెస్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నందిని రెడ్డి తప్ప ఇలా ఎవరు విషెస్ చెప్పలేరు అంటూ ఆయన స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అదేంటి నందిని రెడ్డి ఏకంగా చిన్మయి కాపురంలో చిచ్చు పెట్టావు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఏంటి రాహుల్ మీరు ఇంకా 4జినే వాడుతున్నారా కామెంట్లు చేస్తున్నారు.

అదేంటి బ్రో ఇక్కడ వెయ్యికి పైగా మెసేజ్లు ఉన్నాయి అంటూ మరికొందరు కామెంట్లు చేయడంతో తాను మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడనని అందుకే మెసేజెస్ అన్ని అలాగే ఉండిపోయాయి అంటూ ఈ సందర్భంగా రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా కొత్త సంవత్సరం పూట నందిని రెడ్డి (Nandini Reddy) రాహుల్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus