Nani: నాని ఆలోచన బాగానే ఉంది.. వర్కౌట్ అవుతుందా?

‘రీ రిలీజ్..ల ట్రెండ్ ముగిసిందేమో’ అని అంతా అనుకుంటున్న టైంలో ‘మురారి’ (Murari) వచ్చి ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ ను సాధించింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదే. ‘మురారి’ చిత్రం అప్పటివరకు నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ‘ఖుషి’ (Kushi) రీ రిలీజ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న రీ రిలీజ్ కాబోతున్న ‘ఇంద్ర’ (Indra)  .. ‘మురారి’  రీ రిలీజ్ కలెక్షన్స్ ను బ్రేక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Nani

సో రీ రిలీజ్..ల హవా తగ్గిపోలేదు. ఇంకా పెరిగింది అని చెప్పడానికి వీటిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.దీంతో యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను రీ రిలీజ్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఇందులో నాని (Nani) కూడా ఉన్నాడు. ఈరోజు జరిగిన ‘సరిపోదా శనివారం’  (Saripodhaa Sanivaaram) క్యూ అండ్ ఎ.. మీట్లో నానికి ఓ రిపోర్టర్ నుండి ప్రశ్న ఎదురైంది. ‘ఇప్పుడు రీ రిలీజ్..ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి..

‘మీ సినిమాల్లో ఏదైనా రీ రిలీజ్ కావాలని ఆశపడుతున్నారు?’ అంటూ ఆ రిపోర్టర్ నానిని ప్రశ్నించగా..! అందుకు నాని తడుముకోకుండా ‘పిల్ల జమిందార్’ (Pilla Zamindar) అని సమాధానం ఇచ్చాడు. ఆ సినిమాలో కామెడీ బాగా ఉంటుంది. ప్రేక్షకులు నానిని ఓన్ చేసుకోవడం మొదలు పెట్టింది ఆ సినిమాతోనే..!టీవీల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాని ఎక్కువగా చూసి ఎంజాయ్ చేశారు.

‘మిస్టర్ బచ్చన్’ నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus