Nani: పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. ప్రభాస్ పై కూడా అందుకే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు : దిల్ రాజు

ఇటీవల ‘క‌ల్కి’లో (Kalki 2898 AD) ప్ర‌భాస్ (Prabhas)  పాత్ర‌ని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు అర్ష‌ద్ వార్సీ (Arshad Warsi)   కొన్ని అభ్యంతర కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ad ‘ లో ప్రభాస్    ఓ జోక‌ర్ రోల్ చేశాడని.. నాకు అయితే ప్రభాస్ పాత్ర జోక‌ర్ లా అనిపించిందని…’ వివాదాస్పద కామెంట్లు చేశాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు అతన్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ప్రభాస్ అయితే ఇలాంటివి పట్టించుకునే టైపు కాదు. అతని సినిమాలు ఏంటో.. అతను చేయాల్సింది ఏంటో..

Nani

అది మాత్రమే చేసుకుంటూ పోతాడు. అయితే అర్ష‌ద్ వార్సీ అనే కాదు. ‘టైం దొరికిన ప్రతిసారి ప్రభాస్ ఎదుగుదలపై వారు పడి ఏడుస్తున్నారంటూ’ తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  ప్రెస్ మీట్లో కూడా ఈ టాపిక్ గురించి నానికి  (Nani)  , నిర్మాత దిల్ రాజు (Dil Raju) ..కి ప్రశ్న ఎదురైంది. ‘బాలీవుడ్ వాళ్ళు ఛాన్స్ దొరికిన ప్రతిసారి తెలుగు నటీనటులను లేదా తెలుగు ఫిలిం మేకర్స్ ను తక్కువ చేయడానికి చూస్తున్నారు’ అంటూ అర్ష‌ద్ వార్సీ టాపిక్ తెచ్చాడు ఓ రిపోర్టర్.

దీనికి నాని (Nani)…. ‘అతని 20 ఏళ్ళ సినీ కెరీర్లో చూసుకుంటే ఇప్పుడే అతనికి ఎక్కువ పబ్లిసిటీ జరిగింది. అంతకు మించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సింది లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత దిల్ రాజు.. ‘పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ కూడా పండ్లున్న చెట్టులాంటివాడు అంతే’ అంటూ బదులిచ్చారు.

నాని ఆలోచన బాగానే ఉంది.. వర్కౌట్ అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus