తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్న వారిలో నాని, శర్వానంద్ లు ముందు వరుసలో ఉన్నారు. మంచి కథలను ఎంచుకోవడం, వేగంగా సినిమాని కంప్లీట్ చేయడం, కొత్త ప్రతిభని ప్రోత్సహించడం వీరి విజయానికి మూడు మెట్లు అయ్యాయి. వీరు తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొత్త సినిమాలను చూడడం మాత్రం మిస్ చేయరు. రీసెంట్ గా వచ్చిన నాగశౌర్య ఛలో మూవీని చూసిన వీరు డైరక్టర్ ని అభినందించక ఉండలేకపోయారు. వెంటనే వెంకీ కుడుములకు ఫోన్ చేసి తమకి కూడా కథ సిద్ధం చేయమని చెప్పారని ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. ప్రస్తుతం నాని వరుసగా మూడు సినిమాలకు సైన్ చేశారు.
యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మార్చిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత అవసరాల శ్రీనివాస్ స్క్రిప్ట్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ విషయం తెలిసి వెంకీ శర్వానంద్ తో ముందుగా సినిమా తీయడానికి ఒకే చెప్పినట్లు సమాచారం. హీరో ఎవరైనా పరవాలేదు.. చిత్రాన్ని మేమె నిర్మిస్తామని హారిక అండ్ హాసిని వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు టాక్. మరి ఛలో తర్వాత వెంకీ ఎవరిని డైరక్ట్ చేస్తారో చూడాలి.