కరోనా వైరస్… ఫిబ్రవరి నుండీ మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ పేరు బాగా వినిపిస్తుంది అనుకోండి..! ఇప్పుడు కరుణ అని పలికినా కరోనా నా … అని భయపడుతున్నారు మన ప్రజలు. అయితే ‘కరోనా వైరస్’ పై ఓ దర్శకుడు డిసెంబర్ లోనే సినిమా మొదలు పెట్టేశాడట..!
ఆ దర్శకుడు మరెవరో కాదు… నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ‘అ!’ చిత్రం చేసిన ప్రశాంత్ వర్మ అందరికీ సుపరిచితుడే..! మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాడు ఈ కుర్ర డైరెక్టర్ . ఆ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.అటు తరువాత రాజశేఖర్ తో.. ‘కల్కి’ అనే చిత్రం కూడా చేసాడు. అయితే ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో ప్రశాంత్ వర్మ సైలెంట్ అయిపోయాడు అని అంతా అనుకున్నారు.
ఇక ఈయన డైరెక్ట్ చేసిన ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ విడుదల కావడం లేదు. ఇదిలా ఉంటే.. ఈ కుర్ర డైరెక్టర్ డిసెంబర్ లోనే కరోనా వైరస్ పై సినిమా మొదలు పెట్టేశాడట. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయిందట. త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా ఇతని ఇంటెలిజెన్స్ ను అభినందించాల్సిందే అని కొందరు అంటుంటే … మరికొందరు కనీసం సినిమాలో అయినా కరోనా పై పనిచేసే మెడిసన్ చూపించమని కామెంట్స్ చేస్తున్నారు.