మహేష్ మూవీతో పాటు ప్రభాస్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందట..!

కెరీర్ ప్రారంభం నుండీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు అందుకుంటుంది హీరోయిన్ నివేదా థామస్. ‘జెంటిల్ మెన్’ ‘నిన్ను కోరి’ ‘118’ ‘బ్రోచేవారెవరురా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ‘జై లవ కుశ’ ‘దర్బార్’ వంటి పెద్ద సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈమె నటించిన ‘వి’ చిత్రం విడుదలకు ముస్తాబవుతుండగా … మహేష్ బాబు – పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.!

ఆ చిత్రంలో మహేష్ బాబు డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని.. కాబట్టి ఓ హీరోయిన్ గా ఈమెను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ చిత్రంలో కూడా ఈమె నటించే ఛాన్స్ కొట్టేసింది అనేది మరో తాజా వార్త. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చెయ్యబోతున్నాడు.

ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్ర కోసం నివేదా థామస్ ను ఎంపిక చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అది నిజమైతే నివేదా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి..!

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus